Header Banner

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్‌! మరో ఇద్దరు అరెస్ట్!

  Fri May 16, 2025 20:35        Politics

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్‌లు కొనసాగుతోన్నాయి. తాజాగా ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డితోపాటు మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వీరిద్దరిని అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు అధికారింగా ప్రకటించారు. వరుసగా మూడు రోజుల పాటు వీరిని సిట్ అధికారులు విచారించి... అనంతరం అరెస్ట్ చేశారు. మరోవైపు మందస్తు బెయిల్ కోసం వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. వీరి పిటిషను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడంతో.. వీరి అరెస్ట్ అనివార్యమైంది. జగన్ ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యాన్ని విక్రయించారు.

అలాగే మద్యం కొనుగోళ్లు అన్ని డిజిటల్ చెల్లింపులు కాకుండా.. నేరుగా నగదు చెల్లించి విక్రయాలు జరిగాయి. ఈ మొత్తం వ్యవహారంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా.. నాసిరకం మద్యం కారణంగా.. వేలాది మంది మరణించారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి ఓటరు పట్టం కట్టడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను వెలికి తీయడంపై దృష్టి పెట్టింది. అందులోభాగంగా తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై సిట్ దర్యాప్తునకు ఆదేశించారు. అలాగే మద్యం వ్యవహారంపై సైతం సిట్ దర్యాప్తు జరుగుతోంది.

ఈ దర్యాప్తులో భాగంగా.. ఇప్పటికే పలువురు వైసీపీకి చెందిన వారిని సిట్ అరెస్ట్ చేసింది. ఈ మద్యం కుంభకోణం వ్యవహారంలో పాత్రదారి, సూత్రదారి అయిన రాజ్ కసిరెడ్డి.. గోవా నుంచి హైదరాబాద్‌కు మారు పేరుతో రావడంతో.. అతడిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదీకాక.. ఈ మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియా అంతా రాజ్ కసిరెడ్డి అని వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా ఎదుట ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా కసిరెడ్డితోపాటు ఈ కేసులో పలువురు అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ కేసులో మరిన్ని అరెస్టులు తప్పవనే చర్చ జరుగుతోంది.

ఇది కూడా చదవండి: ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


అర్ధగంటలో అబుదాబీ నుంచి దుబాయ్‌కి ప్రయాణం..! UAE రైలు రంగంలో రికార్డ్!

ఏపీలోని వారందరికీ గుడ్‌న్యూస్.. అకౌంట్లలోకి రూ.15 వేలు! మంత్రి కీలక ప్రకటన!

 

 తల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!

 

 ఎస్సీ, ఎస్టీ కేసులో సజ్జల భార్గవ్‌కు షాక్‌..! వారిదే తప్పు.. సుప్రీం కోర్టు తేల్చేసింది..!



మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!



వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!



సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!



కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!



చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #LiquorScam #APScam #JaganGovt #CorruptionUncovered #SITArrests #BreakingNews #PoliticalScandal